E Rupi: దేశంలో నగదు రహిత ఈ-రూపీ విధానాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

  • దేశంలో సరికొత్త చెల్లింపుల విధానం
  • ఈ-రూపీ విధానం తీసుకువచ్చిన కేంద్రం
  • కాంటాక్ట్ లెస్ చెల్లింపులకు ఉపయుక్తం
  • 8 బ్యాంకుల ద్వారా సేవలు
PM Modi launches e rupi digital payments system

నగదు రహిత చెల్లింపుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకువచ్చింది. దేశంలో నగదు రహిత ఈ-రూపీ విధానాన్ని నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. నగదు రహిత, కాంటాక్ట్ లెస్ ఆర్థిక లావాదేవీల కోసం ఈ-రూపీ విధానానికి రూపకల్పన చేశారు. ఇవాళ్టి నుంచి ప్రజలకు ఈ-రూపీ విధానం అందుబాటులోకి వస్తోంది.

ఈ విధానంలో చెల్లింపులు ఎలా ఉంటాయంటే... మొబైల్ ఫోన్ కు ఈ-రూపీ క్యూఆర్ కోడ్, ఎస్సెమ్మెస్ స్ట్రింగ్ ఓచర్ వస్తాయి. ఈ రెండింటి సాయంతో చెల్లింపులు జరపవచ్చని, ఇది ఎంతో సురక్షితమైన విధానం అని కేంద్రం వెల్లడించింది. ఇంటర్నెంట్ బ్యాంకింగ్, కార్డులు, యాప్ లతో సంబంధం లేకుండా లావాదేవీలు జరపవచ్చని వివరించింది. ప్రస్తుతం 8 బ్యాంకుల ద్వారా ఈ-రూపీ సేవలు అందించనున్నారు.

More Telugu News