పోలవరం రివైజ్డ్ డీపీఆర్ మా వద్ద పెండింగ్ లో లేదు: విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం

02-08-2021 Mon 17:19
  • 2009 జనవరి 20లోపు అందిన ఏ డీపీఆర్ పెండింగ్ లో లేదు
  • ఆ తర్వాత కేంద్రం వద్దకు ఏ డీపీఆర్ రాలేదు
  • 2005-06 ధరల ప్రకారం డీపీఆర్ ను ఆమోదించారు
No Polavaram DPR is in pending says Jal Shakthi ministry

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సవరించిన డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2009 జనవరి 20వ తేదీ లోపు అందిన ఏ డీపీఆర్ కూడా పెండింగ్ లో లేదని చెప్పింది. 2009 జనవరి 20 తర్వాత కేంద్రం వద్దకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ డీపీఆర్ రాలేదని తెలిపింది. 2005-06 ధరల ప్రకారం డీపీఆర్ ను రూ. 10,151.04 కోట్లతో ఆమోదించారని చెప్పింది. ప్రాజెక్టు వ్యయానికి సంబంధించి సవరించిన అంచనాలను అడ్వైజరీ కమిటీ 2011, 2019లో ఆమోదించిందని తెలిపింది. ఈ మేరకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ రాజ్యసభలో ఈ మేరకు సమాధానమిచ్చారు.