CM Jagan: పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు తక్కువమంది హాజరు కావాలి: సీఎం జగన్

  • కరోనా నివారణపై సీఎం జగన్ సమీక్ష
  • పెళ్లిళ్లకు 150 మందికి మించకూడదని ఆదేశం
  • టీచర్లకు వ్యాక్సినేషన్ లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వెల్లడి
  • వచ్చే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు
CM Jagan reviews corona prevention in state

ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో కొవిడ్ నివారణ, వైద్య ఆరోగ్య శాఖలో నాడు-నేడు అంశాలపై నేడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార వర్గాలకు దిశానిర్దేశం చేశారు. వ్యాక్సినేషన్ లో 45 ఏళ్లు దాటినవారికి, గర్భిణులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు తెరుస్తున్నందున, వ్యాక్సినేషన్ లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.

కొవిడ్ నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు తక్కువమంది హాజరు కావాలని తెలిపారు. వివాహాలకు వచ్చేవారిని 150 మందికే పరిమితం చేయాలని ఆదేశించారు. మరికొన్ని నెలల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇకపై ఆర్టీ-పీసీఆర్ టెస్టులు మాత్రమే చేయాలని సూచించారు. ఆసుపత్రుల్లో నాడు-నేడు పనులు గడువులోగా పూర్తి కావాలని స్పష్టం చేశారు.

More Telugu News