ఈ కేసు నుంచి బయటపడేందుకు జగన్ ఓ కేంద్రమంత్రి కుమారుడి సాయం కోరుతున్నారు: చింతా మోహన్

02-08-2021 Mon 14:31
  • తిరుపతిలో మీడియాతో మాట్లాడిన చింతా
  • సీఎం జగన్ మాజీ కాబోతున్నారని జోస్యం
  • జగన్ పతనం ప్రారంభమైందని వ్యాఖ్య 
  • రాష్ట్రంలో రాజకీయ మార్పు రాబోతోందని వ్యాఖ్యలు
Chinta Mohan comments on CM Jagan

ఏపీ సీఎం జగన్ పై కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెయిల్ రద్దు కేసు నుంచి బయటపడేందుకు జగన్ ఓ కేంద్రమంత్రి కుమారుడి సాయం కోరుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ బెయిల్ రద్దు కేసులో సీబీఐ తీరు వివాదాస్పదంగా ఉందని అన్నారు. అయితే, మరికొన్ని రోజుల్లో సీఎం జగన్ మాజీ కావడం తథ్యమని జోస్యం చెప్పారు.

జగన్ రాజకీయ పతనం ప్రారంభమైనట్టేనని, రాష్ట్రంలో రాజకీయ మార్పు రాబోతోందని అన్నారు. తిరుపతిలో ఇవాళ మీడియాతో మాట్లాడుతూ చింతా మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే.