YS Rajasekhar Reddy: వైయస్సార్ కు భారతరత్న ప్రకటించాలని కోరుతూ.. విశాఖ నుంచి పాదయాత్ర

  • పాదయాత్రను చేపట్టిన వైయస్సార్ అమరజ్యోతి స్టూడెంట్స్ అండ్ యూత్ ఫోర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు
  • సింహాచలం ఆలయం నుంచి ఇడుపులపాయ వరకు పాదయాత్ర
  • ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఘనత వైయస్ దని కితాబు
Man starts padayatra demanding Bharat Ratna for YSR

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని కోరుతూ ఆంధ్ర యూనివర్శిటీ పూర్వ విద్యార్థి గాలి గణేశ్ పాదయాత్రను చేపట్టారు. వైయస్సార్ అమరజ్యోతి స్టూడెంట్స్ అండ్ యూత్ ఫోర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన వ్యవహరిస్తున్నారు. విశాఖ సింహాచలం లక్ష్మీనరసింహస్వామి చెంత నుంచి పాదయాత్రను ఆయన ప్రారంభించారు. కడప జిల్లా ఇడుపులపాయ వరకు ఆయన పాదయాత్ర కొనసాగనుంది.

పాదయాత్ర ప్రారంభం సందర్భంగా సింహాచలం కొండ దిగువన పూజలు నిర్వహించి ఆయన అమరజ్యోతిని వెలిగించారు. అనంతరం అమరజ్యోతిని పట్టుకుని పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా గాలి గణేశ్ మాట్లాడుతూ, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనేక సంక్షేమ పథకాలను వైయస్ తీసుకొచ్చారని అన్నారు. భారతరత్నకు వైయస్ అన్ని విధాలా అర్హులని... ఆయనకు భారతరత్న ప్రకటించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని అన్నారు. వచ్చే నెల 2వ తేదీన వైయస్ వర్ధంతి సమయానికి తన పాదయాత్ర ఇడుపులపాయలోని వైయస్ సమాధి వద్దకు చేరుకుంటుందని తెలిపారు.

More Telugu News