Ramesh Varma: 100 కోట్ల బడ్జెట్ తో 'రాక్షసుడు 2'

  • క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన 'రాక్షసుడు'
  • సీక్వెల్ దిశగా సన్నాహాలు 
  • లండన్ నేపథ్యంలో సాగే కథ 
  • హాలీవుడ్ స్థాయిలో చిత్రీకరణ
Rakshasudu 2 as a Pan India movie

కరోనాకి ముందు వచ్చిన సూపర్ హిట్ చిత్రాలలో 'రాక్షసుడు' ఒకటి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ సినిమాకి రమేశ్ వర్మ దర్శకత్వం వహించాడు. ఆడపిల్లలను వరుసగా హత్యలు చేసుకుంటూ వెళ్లే ఓ సైకో కిల్లర్ కథ ఇది. పోలీస్ ఆఫీసర్ అయిన హీరోకి ఆ సైకో కిల్లర్ ఎలాంటి సవాల్ విసురుతాడు? అప్పుడు హీరో ఏం చేస్తాడు? అనేదే కథ.

ఓ మాదిరి బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ రోజుతో ఈ సినిమా రెండు సంవత్సరాలను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత సత్యనారాయణ కోనేరు స్పదించారు. 'రాక్షసుడు' విడుదలై అప్పుడే రెండేళ్లు గడిచిపోయాయా అనిపిస్తోంది. ఆ సినిమా అందించిన విజయాన్ని మేము ఇంకా మరిచిపోలేదు.

ఈ సినిమాకి సీక్వెల్ గా 'రాక్షసుడు 2'ను నిర్మిస్తున్నాం. ఈ  సినిమాలో ఒక స్టార్ హీరో చేస్తారు .. సమయం వచ్చినప్పుడు ఆ హీరో  పేరును ప్రకటిస్తాము. కథ అంతా కూడా 'లండన్' నేపథ్యంలో జరుగుతుంది .. త్వరలోనే అక్కడ షూటింగు మొదలవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ సినిమా కోసం 100 కోట్ల బడ్జెట్ ను కేటాయించడం జరిగింది. 'రాక్షసుడు'ను మించిన ఉత్కంఠభరితమైన మలుపులతో ఈ సినిమా సాగుతుంది" అని అన్నారు.

More Telugu News