Raviteja: రవితేజను మెప్పించిన 'భీష్మ' డైరెక్టర్?

Raviteja another movie with Venky kudumula
  • 'ఛలో' సినిమాతో తొలి హిట్
  • 'భీష్మ'తో బ్లాక్ బస్టర్
  • రవితేజ నుంచి గ్రీన్ సిగ్నల్
  • త్వరలోనే సెట్స్ పైకి    
హీరో .. హీరోయిన్ ప్రేమించుకోవడం .. వీలైతే మాట్లాడుకోవడం .. కుదిరితే పాటలు పాడుకోవడం మామూలే. అయితే ఈ మధ్యలో చోటుచేసుకునే ఆసక్తికరమైన అంశాలపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. అలా తన సినిమా కథల్లో ఏయే అంశాలు ఎక్కడ పొందుపరచాలో .. ఎక్కడ ఏ విషయాలను చెప్పాలో .. యూత్ ను  ఎలా మెప్పించాలో బాగా తెలిసిన దర్శకుడిగా వెంకీ కుడుముల కనిపిస్తాడు.

నాయక నాయికల మధ్య పరిచయం .. ప్రేమ .. పెళ్లి వంటి అంశాల మధ్య ఆయన అల్లుకునే సన్నివేశాలు చాలా సరదాగా .. ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం ఆహ్లాదంగా సాగుతాయి. 'ఛలో' .. 'భీష్మ' సినిమాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. అలాంటి వెంకీ కుడుముల .. రవితేజకు ఒక కథను వినిపించి ఓకే అనిపించుకున్నాడనే టాక్ బలంగా వినిస్తోంది.

వెంకటేశ్ కథానాయకుడిగా వెంకీ కుడుముల ఒక సినిమా చేయనున్నట్టు ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఆ ప్రాజెక్టులో  వాస్తవమెంతనే విషయాన్ని అలా ఉంచితే, ఇప్పుడు రవితేజ పేరు తెరపైకి వచ్చింది. ఈ కథ పట్ల రవితేజ చాలా ఉత్సాహంగా ఉన్నాడని అంటున్నారు. 'రామారావు ఆన్ డ్యూటీ' తరువాత ఆయన చేసే సినిమా ఇదేనని చెప్పుకుంటున్నారు.

Raviteja
Venky Kuduula
Venkatesh Daggubati

More Telugu News