Rashi Khanna: ధనుశ్ జోడీగా రాశి ఖన్నా ఖాయమైపోయినట్టే!

  • రిలీజ్ కి రెడీగా 'అరణ్మణై 3'
  • లైన్లోనే ఉన్న 'తుగ్లక్ దర్బార్'
  • షూటింగు దశలో 'సర్దార్'
  • ధనుశ్ జోడీగా ఛాన్స్
Rashii Khanna in Dhanush movie

రాశి ఖన్నా ఎప్పుడు చూసినా చాలా కూల్ గా ఉంటుంది. కొత్త కథానాయికల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ, తాపీగా తన పని తాను చేసుకువెళుతూ ఉంటుంది. కావలసినంత గ్లామర్ ఉన్నప్పటికీ, అందాలు ఆరబోసే విషయంలో పరిధి దాటకపోవడంతో ఇక ఇంటికి వెళ్లడం ఖాయమని అంతా అనుకున్నారు.

కానీ నిదానంగా ఆమెకి అవకాశాలు పెరుగుతున్నాయి. తెలుగులోనే కాదు .. తమిళ .. హిందీ భాషల నుంచి కూడా ఆమెను వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో చైతూ సరసన 'థ్యాంక్యూ' చేస్తున్న రాశి ఖన్నా, 'పక్కా కమర్షియల్'లో గోపీచంద్ సరసన అలరించనుంది. హిందీ సినిమాల్లో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తూ, వెబ్ సిరీస్ లలో దూకుడు చూపుతోంది.

ఇక  తమిళంలో 'అరణ్మణై 3' .. 'తుగ్లక్ దర్బార్' విడుదలకి ముస్తాబవుతూ ఉండగా, కార్తీ జోడిగా 'సర్దార్' సినిమా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ధనుశ్ తదుపరి సినిమాలోనూ అవకాశాన్ని అందుకుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మిత్రన్ జవహర్ దర్శకత్వంలో ధనుశ్ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసం రాశి ఖన్నాను సంప్రదిస్తున్నారట. ఈ అవకాశాన్ని ఆమె వదులుకోదు గనుక, ఈ కాంబినేషన్ ఖాయమేనని అనుకుంటున్నారు.    

More Telugu News