India: భారత్-బంగ్లాదేశ్ మధ్య 50 ఏళ్ల తర్వాత గూడ్స్ రైలు సేవలు ప్రారంభం

  • భారత్‌లోని హల్దిబాడీ, బంగ్లాదేశ్‌లోని ఛిలహతి మధ్య మార్గం పునరుద్ధరణ
  • గతేడాది ప్రారంభించిన మోదీ, హసీనా
  • కరోనా కారణంగా ప్రారంభం కాని సేవలు
  • నిన్న బంగ్లాదేశ్‌కు పయనమైన గూడ్స్ రైలు
First goods train from Indias Haldibari to Chilahati in Bangladesh

భారత్-బంగ్లాదేశ్ మధ్య దాదాపు అర్ధ శతాబ్దం తర్వాత గూడ్స్ రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. భారత్ నుంచి నిన్న ఓ గూడ్స్ రైలు బంగ్లాదేశ్‌కు ప్రయాణం ప్రారంభించింది. పునరుద్ధరించిన హల్దిబాడీ-ఛిలహతి మార్గాన్ని 17 డిసెంబరు 2020న భారత ప్రధాని నరేంద్రమోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రారంభించారు. అయితే, కరోనా కారణంగా ఇప్పటి వరకు ఈ మార్గంలో అధికారికంగా రైలు సేవలు ప్రారంభం కాలేదు. తాజాగా నిన్న పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్‌దివార్ జిల్లాలోని దిమ్‌దిమ స్టేషన్ నుంచి ఉదయం పదిన్నర గంటలకు బంగ్లాదేశ్‌కు గూడ్స్ రైలు ప్రయాణం మొదలైంది. ఇది బల్దిబరి మీదుగా బంగ్లాదేశ్‌లోని ఛిలహతికి చేరుకుంటుంది. గతంలో ఈ మార్గంలో 1965 వరకు రవాణా జరిగింది.

More Telugu News