Tollywood: ‘శుభముహూర్తం’ దర్శకుడు గిరిధర్ కన్నుమూత

Tollywood director Girdhar Passed Away
  • అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ పరిశ్రమలో కాలుమోపిన గిరిధర్
  • రోడ్డు ప్రమాదం కారణంగా ఆరేళ్లుగా మంచానికే పరిమితమైన డైరెక్టర్
  • పలు సినిమాల ద్వారా నటుడిగానూ రాణింపు 
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకుడు, నటుడు ఇరుగు గిరిధర్ కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. ఆరేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గిరిధర్ అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యారు. నిన్న తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. టాలీవుడ్ సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి, గుణశేఖర్, ఈవీవీ సత్యనారాయణ వంటివారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా గిరిధర్ పనిచేశారు.

అలాగే, గుడుంబా శంకర్, అన్నవరం, వన్, సుప్రీమ్, వరుడు వంటి సినిమాలకు కోడైరెక్టర్‌గానూ పనిచేశారు. చంద్రమోహన్, ఆమని, ఇంద్రజ, వినోద్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన శుభముహూర్తం సినిమాకు దర్శకత్వం వహించి విజయాన్ని అందుకున్నారు. అలాగే, ఎక్స్‌ప్రెస్ రాజా, 100 పర్సంట్ లవ్, సర్దార్ గబ్బర్ సింగ్, శ్రీమంతుడు తదితర 20 సినిమాల్లో నటించారు. గిరిధర్ మృతికి తెలుగు సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
Tollywood
Giridhar
Passed Away

More Telugu News