దర్శకుడికి పెన్ కానుకగా ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి

01-08-2021 Sun 21:09
  • బాబీ దర్శకత్వంలో చిరంజీవి
  • ఇవాళ బాబీ పుట్టినరోజు
  • చిరును కలిసిన బాబీ
  • ఆశీస్సులు అందజేసిన మెగాస్టార్
Chiranjeevi gifts a pen to his director Bobby

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎంతో కష్టపడి స్వయంకృషితో ఈస్థాయికి ఎదిగిన నటుడు. అందుకే ఆయన కష్టాన్ని నమ్ముకున్న వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటారు. తాజాగా, తన కొత్త సినిమా దర్శకుడు బాబీని చిరంజీవి మనస్ఫూర్తిగా అభినందించారు. ఇవాళ దర్శకుడు బాబీ పుట్టినరోజు. మెగాస్టార్ ను కలిసి ఆశీస్సులు అందుకోవాలని నిర్ణయించుకున్న బాబీ... చిరును కలిశారు. ఈ సందర్భంగా ఆ దర్శకుడికి బర్త్ డే విషెస్ తెలిపిన చిరంజీవి... అపురూపమైన రీతిలో ఓ పెన్ ను కానుకగా ఇచ్చారు.

ఆ పెన్ అందుకున్న బాబీ ఆనందం అంతాఇంతా కాదు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో అందరితో పంచుకున్నారు. "మీ నుంచి అందుకున్న గిఫ్ట్ నాకెంతో ప్రత్యేకం సర్... మీకున్న కోట్లాదిమంది ఫ్యాన్స్ లో నేనూ ఒకడ్ని. ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీతో సినిమా తెరకెక్కించాలన్న నా కల నిజమైంది" అని వివరించారు.