బిగ్ బాస్ సీజన్-5 కొత్త లోగో ఇదిగో!

01-08-2021 Sun 20:15
  • త్వరలో బిగ్ బాస్ ఐదో సీజన్
  • నూతన లోగో విడుదల చేసిన స్టార్ మా
  • ఆకట్టుకునేలా ఉన్న కొత్త లోగో
  • హోస్ట్ ఎవరన్నదానిపై కొనసాగుతున్న సస్పెన్స్
New logo for Bigg Boss Telugu fifth season

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో అంటే బిగ్ బాస్ అనే చెప్పాలి. ఈ షో తెలుగులో ఇప్పటివరకు నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా ఐదో సీజన్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, బిగ్ బాస్ సీజన్-5 కొత్త లోగోను నిర్వాహకులు విడుదల చేశారు. స్టార్ మా చానల్ విడుదల చేసిన ఈ కొత్త లోగో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

కాగా, బిగ్ బాస్-5 కంటెస్టెంట్లకు సంబంధించి ఇప్పటికే అనేక పేర్లు వినిపిస్తున్నా, అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. అటు, హోస్ట్ ఎవరన్న దానిపైనా సస్పెన్స్ కొనసాగుతోంది. నాగార్జునే ఈసారి కూడా బిగ్ బాస్ షోని నడిపిస్తాడని ప్రచారం జరుగుతుండగా, కొత్త హోస్ట్ గా రానా పేరు కూడా బలంగా వినిపిస్తోంది.