ఏపీలో కొత్తగా 2,287 కరోనా పాజిటివ్ కేసులు

01-08-2021 Sun 19:30
  • ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • గత 24 గంటల్లో 85,856 కరోనా టెస్టులు
  • తూర్పు గోదావరి జిల్లాలో 410 కేసులు
  • రాష్ట్రంలో 18 మంది మృతి
  • ఇంకా 21,019 మందికి చికిత్స
Corona cases and deaths in AP

రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 85,856 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,287 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 410 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 377 కేసులు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 299, గుంటూరు జిల్లాలో 231 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 28 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 2,430 మంది కరోనా నుంచి కోలుకోగా, 18 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,395కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,68,462 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,34,048 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 21,019 మంది చికిత్స పొందుతున్నారు.