Lamont Marcell Jacobs: ఎవరూ ఊహించని రీతిలో టోక్యో ఒలింపిక్స్ 100 మీ పసిడి గెల్చిన ఇటలీ అథ్లెట్

  • టోక్యో ఒలింపిక్స్ లో ముగిసిన 100 మీ పరుగు
  • విజేతగా ఇటలీ అథ్లెట్ లామోంట్ మార్సెల్ జాకబ్స్
  • 9.80 సెకన్ల టైమింగ్ తో నెగ్గిన జాకబ్స్
  • రెండో స్థానంలో కెర్లీ ఫ్రెడ్
Italian athlete Lamont Marcell Jacobs wins mens hundred meters race

టోక్యో ఒలింపిక్స్ లో అనూహ్య పరిణామం జరిగింది. ఏమాత్రం అంచనాలు లేని ఇటలీ అథ్లెట్ లామోంట్ మార్సెల్ జాకబ్స్ పురుషుల 100 మీటర్ల పరుగులో స్వర్ణం ఎగరేసుకెళ్లాడు.

సాధారణంగా ఏ ఒలింపిక్స్ లోనైనా 100 మీటర్ల రేసు అత్యంత ఆకర్షణీయమైన ఈవెంట్. ఇటీవలి వరకు ఉసేన్ బోల్ట్ బరిలో ఉండడంతో 100మీ పరుగు ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూశారు. అయితే బోల్ట్ రిటైర్మెంట్ ప్రకటించడంతో, టోక్యో ఒలింపిక్స్ లో అతడి వారసుడెవరన్నదానిపై సర్వతా ఆసక్తి కనిపించింది. అందరూ బ్రోమెల్, డిగ్రాస్, యోహాన్ బ్లేక్, అకానే సింబైన్, జార్నెల్ హ్యూస్ లలో ఒకరు విజేత అవుతారని భావించారు.

కానీ అంచనాలను తలకిందులు చేస్తూ, 100 మీటర్ల పరుగు పందెం ఫైనల్లోకి ప్రవేశించిన లామోంట్ జాకబ్స్... ఫైనల్లోనూ చిరుతలా పరుగులు తీసి పసిడి విజేతగా అవతరించాడు. స్వర్ణం నెగ్గే క్రమంలో జాకబ్స్ 9.80 సెకన్లలో రేసు నెగ్గాడు. అమెరికా స్ప్రింటర్ కెర్లీ ఫ్రెడ్ 9.84 సెకన్లతో రజతం సాధించగా, కెనడా రన్నర్ ఆండ్రీ డిగ్రాస్ 9.89 సెకన్లతో కాంస్యం దక్కించుకున్నాడు.

More Telugu News