కర్నూలు జిల్లా జంట హత్యలపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు చంద్రబాబు లేఖ

01-08-2021 Sun 16:04
  • కర్నూలు జిల్లాలో జూన్ 17న జంటహత్యలు
  • నాగేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డిల హత్యలు
  • నిందితులను ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదన్న చంద్రబాబు
  • సాక్షుల్ని బెదిరిస్తున్నారని ఆరోపణ
Chandrababu shot a letter again to AP DGP

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. కర్నూలు జిల్లాలో జూన్ 17న నాగేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డిల హత్యలపై డీజీపీకి లేఖాస్త్రం సంధించారు. ఈ జంట హత్యల  కేసులో నిందితులను ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదని ఆరోపించారు.

సాక్షుల్ని బెదిరిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల కుటుంబ సభ్యులకు కూడా బెదిరింపులు ఎదురవుతున్నాయని వెల్లడించారు. నేరస్తులను వెంటనే అదుపులోకి తీసుకుని సాక్షులకు రక్షణ కల్పించాలని చంద్రబాబు తన లేఖలో స్పష్టం చేశారు.