Telangana Cabinet: ప్రగతిభవన్ లో ప్రారంభమైన తెలంగాణ క్యాబినెట్ సమావేశం

  • సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం
  • కరోనా పరిస్థితులపై చర్చ
  • వ్యాక్సినేషన్, ఆసుపత్రుల్లో ఏర్పాట్లపై చర్చ
  • సత్యవతి రాథోడ్ అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Telangana cabinet meet has started

సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ ప్రగతిభవన్ లో తెలంగాణ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులు, దేశంలో, రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీరుతెన్నులపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. జిల్లాల వారీగా కరోనా స్థితిగతులు, వ్యాక్సినేషన్, ఆసుపత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు, మౌలిక వసతులపైనా చర్చిస్తున్నారు.

కాగా, కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల పూర్తి వివరాలు తెప్పించాలని వైద్య శాఖ కార్యదర్శిని మంత్రిమండలి ఆదేశించింది. అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి సమగ్ర సమచారం సేకరించాలని స్పష్టం చేసింది.

ఇక, రాష్ట్రంలోని అనాథలు, అనాథ శరణాలయాల పరిస్థితులు, సమస్యలు, అవగాహన విధాన రూపకల్పన కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, వి.శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్ సభ్యులుగా నియమించారు.

More Telugu News