GST: జులై మాసంలో జీఎస్టీ వసూళ్ల వివరాలు తెలిపిన కేంద్రం

  • జులై నెలలో రూ.1.16 లక్షల కోట్లు వసూలు
  • గతేడాది జులై కంటే 33 శాతం అదనం
  • 2020 జులైలో రూ.87 వేల కోట్ల మేర జీఎస్టీ
  • రాబోయే నెలల్లో వృద్ధి కొనసాగుతుందన్న కేంద్రం
Union govt reveals GST in July

జులై మాసానికి సంబంధించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నేడు వెల్లడించింది. జులై నెలలో రూ.1,16,393 కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్టు తెలిపింది. 2020 జులై మాసంతో పోల్చితే ఈసారి 33 శాతం అదనంగా జీఎస్టీ వసూలైనట్టు వివరించింది. గతేడాది జులైలో జీఎస్టీ వసూళ్లు రూ.87,422 కోట్లు అని పేర్కొంది.

ఈ ఏడాది జులై మాసం నాటి జీఎస్టీ వసూళ్ల వివరాలు తెలుపుతూ... కేంద్ర జీఎస్టీ వసూళ్లు రూ.22,197 కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ వసూళ్లు రూ.28,541 కోట్లు అని వెల్లడించింది. సమీకృత జీఎస్టీ వసూళ్లు రూ.57,864 కోట్లు (దిగుమతులపై వసూలైన రూ.27,900 కోట్లతో కలిపి) అని పేర్కొంది. సెస్ రూపేణా రూ.7,790 కోట్లు (దిగుమతులపై వసూలైన రూ.815 కోట్లతో కలిపి) అని కేంద్రం వివరించింది. రాబోయే నెలల్లోనూ జీఎస్టీ వసూళ్ల వృద్ధి కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

More Telugu News