బద్ధకమా.. అయితే ఇలా చేసేయండంటున్న ఆనంద్​ మహీంద్ర: వీడియో

01-08-2021 Sun 13:39
  • ఆదివారం ఎక్సర్ సైజ్ చేయడంలో బద్ధకంపై ట్వీట్
  • ఒలింపిక్స్ జిమ్నాస్టిక్ వీడియో పోస్ట్
  • దాన్ని చూస్తే సరి అని రాసుకొచ్చిన ఆనంద్
Anand Mahindra Suggestion To Leave Sunday Lazyness

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు స్ఫూర్తిదాయకమైన వీడియోలను పోస్ట్ చేస్తూ అందరిలోనూ ఉత్తేజం నింపుతుంటారు ఆనంద్ మహీంద్ర. తాజాగా బద్ధకం మీద ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు. అలా చేస్తే బద్ధకాన్ని వదిలించుకోవచ్చని సూచించారు.

‘‘ఆదివారం ఎక్సర్ సైజులు చేయాలంటే బద్ధకంగా ఉంటోందా? అయితే, దానికిదే పరిష్కారం. నాలాగే మీరందరూ ఈ వీడియో క్లిప్ ను సేవ్ చేసి పెట్టుకోండి. కనీసం రెండుసార్లైనా దాన్ని చూడండి. చివరగా మీరు అలసిపోతారు. ఒంట్లోని ఒక్కో కండరం ఎక్సర్ సైజ్ చేసినట్టు అనిపిస్తుంది. నేను హామీ ఇస్తున్నా’’ అంటూ ఒలింపిక్స్ జిమ్నాస్టిక్ వీడియోను ఆయన పోస్ట్ చేసి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.