Anuradha Chaudhary: ఎట్టకేలకు లేడీ డాన్ అనురాధ చౌదరిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

  • లేడీ డాన్ గా ప్రసిద్ధికెక్కిన అనురాధ చౌదరి
  • హత్యలు, దోపిడీలు, కిడ్నాప్ కేసుల్లో నిందితురాలు
  • ప్రియుడి ఎన్ కౌంటర్ తర్వాత మకాం మార్పు
  • మరో గ్యాంగ్ స్టర్ కాలా జతేదీతో సహజీవనం
Delhi Police arrests lady don Anuradha Chaudhary

ఓ లేడీ డాన్ కోసం దేశంలోని 12 రాష్ట్రాల్లో ఢిల్లీ పోలీసులు జల్లెడ పట్టారంటే అతిశయోక్తి కాదు. రాజస్థాన్ కు చెందిన కరుడుగట్టిన లేడీ డాన్ అనురాధ చౌదరిపై అనేక హత్య కేసులు, దోపిడీ, కిడ్నాప్ కేసులు ఉన్నాయి. తాజాగా ఆమెను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

అనురాధ చౌదరి గతంలో ఆనంద్ పాల్ సింగ్ అనే గ్యాంగ్ స్టర్ తో సహజీవనం చేసింది. అయితే 2017లో ఆనంద్ పాల్ సింగ్ రాజస్థాన్ పోలీసులతో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించాడు. అప్పుడు అనురాధ చౌదరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తర్వాత ఆమె పోలీసుల నుంచి తప్పించుకుంది. కొంతకాలం తర్వాత సందీప్ అలిసాయస్ కాలా జతేదీ అనే మరో గ్యాంగ్ స్టర్ తో జతకట్టింది. గత కొన్నినెలలుగా వీరిద్దరూ కలిసి ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు.

అనురాధ చౌదరి పురుష గ్యాంగ్ స్టర్లకు తీసిపోని రీతిలో నేరాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసిరింది. అటు, కాలా జతేదీపైనా రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో అనేక హత్యలు, దోపిడీ కేసులు ఉన్నాయి. అంతేకాదు, ఇటీవల ఢిల్లీలో యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులోనూ కాలా జతేదీ పేరు వినిపించింది. అంతకుముందే అనేక కేసుల్లో నిందితులైన కాలా జతేదీ, అనురాధ చౌదరిల కోసం ఢిల్లీ స్పెషల్ పోలీసులు తీవ్ర వేట సాగించారు.

ఉత్తరప్రదేశ్ లో మొదట కాలా జతేదీ పట్టుబడగా, ఆ మరుసటి రోజే అనురాధ చౌదరి దొరికిపోయింది. కాగా, వీరిద్దరి అరెస్ట్ తో అంతర్జాతీయ సిండికేట్ బట్టబయలైంది. విదేశాల్లో ఉంటూ భారత్ లో కాంట్రాక్టు హత్యలు, దోపిడీలు, భూకబ్జాలు, స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తించారు.

  • Loading...

More Telugu News