అశ్విన్ బాబు మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్!

31-07-2021 Sat 19:13
  • అశ్విన్ బాబు నుంచి మరో మూవీ
  • ఆసక్తిని రేపుతున్న ప్రీ లుక్
  • రేపు మధ్యాహ్నం ఫస్టులుక్
  • కథానాయికగా నందిత శ్వేత
Ashwin Babu new movie pre look

యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి  చాలాకాలమే అయింది. అప్పటి నుంచి కూడా తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. అలా ఇంతవరకూ 6 సినిమాలు చేసిన ఆయన, తనకంటూ కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. తన 7వ సినిమాగా ఆయన ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు.

అశ్విన్ బాబు చేస్తున్న 7వ సినిమాకు ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. AB 7 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ప్రీ లుక్ ను వదిలారు. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫస్టులుక్ ను రేపు మధ్యాహ్నం 2:52 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు ప్రీ లుక్ ద్వారా చెప్పారు. టైటిల్ ను కూడా రేపు రివీల్ చేయవచ్చు. గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్నాడు.

అనిల్ కన్నెగంటి నుంచి ఇంతకుముందు 'అసాధ్యుడు' .. 'మిస్టర్ నూకయ్య' .. 'రన్' సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఆయన ఈ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో అశ్విన్ బాబు సరసన నాయికగా నందిత శ్వేత కనిపించనుంది. ఈ సినిమా అశ్విన్ బాబు కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.