సింధూ... ఓడినా, గెలిచినా ఎప్పటికీ నువ్వే మా చాంపియన్: బండి సంజయ్

31-07-2021 Sat 18:19
  • టోక్యో ఒలింపిక్స్ లో సింధుకు నిరాశ
  • బ్యాడ్మింటన్ సెమీస్ లో ఓటమి
  • భారత్ కు నువ్వే గర్వకారణమన్న బండి సంజయ్
  • అద్భుతంగా పోరాడావంటూ కితాబు
Bandi Sanjay tweets on PV Sindhu lose in Tokyo Olympics

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ లో ఓటమి పాలైన నేపథ్యంలో, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. సింధు ఓడినా, ఆమెపై తమ అభిమానంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. "సింధూ... ఓడినా, గెలిచినా ఎప్పటికీ నువ్వే మా చాంపియన్. భారత్ కు నువ్వే గర్వకారణం. ఆటలో గెలుపోటములు  సహజం. నీ ఘనతల గురించి మరోసారి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నువ్వు అద్భుతంగా పోరాడావు. నీ ప్రస్థానం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. నీ ఘనతల పట్ల మేమెంతో గర్విస్తున్నాం" అంటూ ట్వీట్ చేశారు.