వచ్చేనెలలో 'అన్నాత్తే' షూటింగ్ పూర్తి .. దీపావళికి ఖాయమే!

31-07-2021 Sat 17:56
  • రజనీ తాజా చిత్రంగా 'అన్నాత్తే'
  • ముగింపుదశలో చిత్రీకరణ
  • భారీ తారాగణం ప్రత్యేక ఆకర్షణ
  • ముందుగా చెప్పిన తేదీకే రిలీజ్
Annaatthe will released on Deepavali

మొదటి నుంచి కూడా రజనీకాంత్ తన సినిమాల్లో యాక్షన్ తో పాటు ఎమోషన్ ఉండేలా చూసుకుంటూ ఉంటారు.  కొంతకాలం నుంచి కథాకథనాల విషయంలో మాత్రమే కాకుండా, సినిమా .. సినిమాకి కూడా లుక్ విషయంలో శ్రద్ధ తీసుకుంటూ వెళుతున్నారు. అలా ఈ సారి ఆయన చేస్తున్న ఎమోషన్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా 'అన్నాత్తే' కనిపిస్తోంది.

భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో 'అన్నాత్తే' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఆ మధ్య కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగు,, ఇటీవల రజనీకాంత్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన తరువాత మళ్లీ మొదలైంది. వచ్చేనెలలో షూటింగు పార్టు పూర్తవుతుందని అంటున్నారు.

ఈ సినిమా షూటింగు విషయంలో జరిగిన జాప్యం వలన, ముందుగా చెప్పిన ప్రకారం దీపావళికి ఈ సినిమా థియేటర్లకు రాకపోవచ్చనే ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారంలో నిజం లేదనే అంటున్నారు. ముందుగా చెప్పినట్టుగా దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీనే ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు. ఖుష్బూ .. మీనా .. నయనతార .. కీర్తి సురేశ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.