Mahesh Babu: సంక్రాంతి బరిలో 'సర్కారు వారి పాట'... కొత్త లుక్ తో మహేశ్ బాబు

 First notice from Mahesh Babu starring Sarkaru Vaari Paata movie
  • సర్కారు వారి పాట నుంచి ఫస్ట్ నోటీస్
  • మహేశ్ బాబు పిక్ ను పంచుకున్న చిత్రబృందం
  • కొత్త హెయిర్ స్టయిల్ లో మహేశ్
  • సంక్రాంతికి కలుసుకుందామన్న మహేశ్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర యూనిట్ మహేశ్ బాబు కొత్త లుక్ ను సోషల్ మీడియాలో పంచుకుంది. గత చిత్రాలకు భిన్నంగా మహేశ్ బాబు కొత్త హెయిర్ స్టయిల్ తో ఈ చిత్రంలో కనువిందు చేయనున్నాడని తాజా పిక్ చెబుతోంది. అంతేకాకుండా, సర్కారు వారి పాట సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతుందని వెల్లడించింది. 2022 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు ప్రకటించారు.

మహేశ్ బాబు స్పందిస్తూ, సరికొత్త యాక్షన్, ఎంటర్టయిన్ మెంట్ తో వచ్చేస్తున్నాం... సంక్రాంతికి కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు.

"సూపర్ స్టార్ మహేశ్ బాబు వచ్చేశాడు... సర్కారు వారి పాట నుంచి ఫస్ట్ నోటీస్ వచ్చేసింది" అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పోస్టు చేసింది. దాంతోపాటే, మహేశ్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఆగస్టు 9న సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ ఉంటుందని అభిమానులకు తీపి కబురు చెప్పింది. పరశురాం దర్శకత్వంలో వస్తున్న సర్కారు వారి పాట చిత్రంలో మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
Mahesh Babu
Sarkaru Vaari Paata
First Notice
New Look
Tollywood

More Telugu News