టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సెమీస్ లో సింధు ఓటమి

31-07-2021 Sat 16:49
  • సెమీఫైనల్లో తై జు యింగ్ విజయం
  • 18-21, 12-21తో సింధు పరాజయం
  • వరుసగా రెండు గేములూ ప్రత్యర్థికి కోల్పోయిన వైనం
  • రేపు కాంస్యం కోసం ఆడనున్న సింధు
PV Sindhu lost badminton semis in Tokyo Olympics

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో నిరాశాజనకమైన ఫలితం ఎదురైంది. స్వర్ణం తెస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సెమీఫైనల్లో ఓటమిపాలైంది. వరల్డ్ నెంబర్ తై జు యింగ్ (చైనీస్ తైపే) తో ఈ మధ్యాహ్నం జరిగిన పోరులో సింధు 18-21, 12-21తో పరాజయం చవిచూసింది. తొలి గేమ్ లో పోరాడిన సింధు, రెండో గేమ్ ఆరంభంలో ఫర్వాలేదనిపించినా, ఆపై క్రమేణా మ్యాచ్ పై పట్టు కోల్పోయింది. శక్తిమంతమైన షాట్లు, తెలివైన క్రాస్ కోర్టు ఆటతీరుతో తై జు యింగ్ మ్యాచ్ ను తన వశం చేసుకుంది. ఇక సింధు రేపు కాంస్యం కోసం జరిగే మ్యాచ్ లో ఆడనుంది.