టోక్యో ఒలింపిక్స్: తొలి గేమ్ ను ప్రత్యర్థికి కోల్పోయిన పీవీ సింధు

31-07-2021 Sat 16:30
  • బ్యాడ్మింటన్ లో సెమీఫైనల్స్
  • మహిళల సింగిల్స్ లో సింధు వర్సెస్ యింగ్
  • తొలి గేమ్ లో 18-21తో సింధు ఓటమి
  • రెండో గేమ్ లో హోరాహోరీ
PV Sindhu lost first game to opponent in Tokyo Olympics badminton semis

టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్ సమరంలో తెలుగుతేజం పీవీ సింధు... వరల్డ్ నెంబర్ వన్ తై జు యింగ్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుండగా, సింధు తొలి గేమ్ ను ప్రత్యర్థికి కోల్పోయింది. ప్రతి పాయింట్ కోసం నువ్వానేనా అన్నట్టు సాగిన ఈ గేమ్ ను తై జు యింగ్ 21-18 తేడాతో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో, రెండో గేమ్ ను సింధు ఆశావహ దృక్పథంలో ప్రారంభించింది. ప్రస్తుతం 4-3 తేడాతో యింగ్ పై ఆధిక్యంలో ఉంది.