టోక్యో ఒలింపిక్స్ లో దక్షిణాఫ్రికాపై నెగ్గిన భారత మహిళల హాకీ జట్టు... క్వార్టర్ ఫైనల్ ఆశలు సజీవం

31-07-2021 Sat 14:14
  • గ్రూప్-ఏలో చివరి లీగ్ మ్యాచ్ ఆడిన భారత్
  • 4-3తో దక్షిణాఫ్రికాపై విజయం
  • రేసులో నిలిచిన భారత అమ్మాయిలు
  • చావోరేవో మ్యాచ్ లో సత్తా చాటిన వైనం
Indian hockey eves won their last league match against South Africa in Tokyo Olympics

టోక్యో ఒలింపిక్స్ లో భారత హాకీ అమ్మాయిలు సత్తా చాటారు. రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను చిత్తు చేశారు. ఇవాళ జరిగిన గ్రూప్-ఏ చివరి లీగ్ మ్యాచ్ లో భారత మహిళల హాకీ జట్టు 4-3తో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. తద్వారా క్వార్టర్ ఫైనల్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. గ్రూప్-ఏలో మొత్తం 5 మ్యాచ్ లు ఆడిన భారత్ 2 మ్యాచ్ లలో గెలిచి, 3 మ్యాచ్ లలో ఓటమిపాలైంది.

ఇక భారత అమ్మాయిలు నాకౌట్ దశకు చేరడం ఐర్లాండ్, బ్రిటన్ జట్ల మధ్య మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ ఓడిపోయినా, మ్యాచ్ డ్రాగా ముగిసినా చాలు... భారత్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంటుంది.