Raghavenra Rao: రాఘవేంద్రరావుకు పవన్ కల్యాణ్ లేఖ

Pawan Kalyan writes letter to Raghavendra Rao
  • 'పెళ్లి సందD' సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్న రాఘవేంద్రరావు
  • నటుడిగా కనిపించడం సంతోషకరమన్న పవన్
  • మిమ్మల్ని డైరెక్ట్ చేయడానికి దిగ్గజ దర్శకులు ఎదురు చూస్తారని వ్యాఖ్య
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు జనసేనాని పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ఇంతకాలం తెర వెనుక ఉండి ఎంతో మంది నటీనటుల్ని డైరెక్ట్ చేసిన మీరు... ఇప్పుడు తెర ముందుకు వచ్చి నటుడిగా కనిపించడం సంతోషకరమని లేఖలో పేర్కొన్నారు. ఇకపై మిమ్మల్ని డైరెక్ట్ చేయడానికి ఎంతో మంది దిగ్గజ దర్శకులు ఎదురు చూడటం ఖాయమని చెప్పారు.

ప్రముఖ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న 'పెళ్లి సందD' సినిమాలో రాఘవేంద్రరావు ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. రోషన్ కు తాతగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రోమోలో సూటు, బూటు వేసుకుని ఆయన చాలా స్టైలిష్ గా కనిపించారు. వశిష్ట అనే పాత్రను ఆయన పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాఘవేంద్రరావుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కల్యాణ్ లేఖ రాశారు.
Raghavenra Rao
Tollywood
Pawan Kalyan
Janasena

More Telugu News