TTD: టీటీడీలోని ఆరుగురు ఉద్యోగులపై శాశ్వత వేటు

  • 2006-08 మధ్య వీరిపై పలు ఆరోపణలు
  • ఆర్జిత సేవా టికెట్ల విక్రయంలో అవకతవకలు
  • అనుకూల వ్యక్తులకు 30 ఏళ్ల వరకు టికెట్ల విక్రయం
  • విచారణ అనంతరం వేటు
TTD Remove 6 employees

ఆరుగురు టీటీడీ ఉద్యోగులను శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తూ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరూ టీటీడీ పరిధిలోని వివిధ కేడర్లలో పనిచేస్తున్నారు. తొలగింపునకు గురైన ఉద్యోగులపై పలు ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తోంది. 2006-08 మధ్య కాలంలో ఆర్జిత సేవా టికెట్లను ఇష్టం వచ్చినట్టు విక్రయించినట్టు వీరిపై ఆరోపణలున్నాయి.

తమ అనుకూల వ్యక్తులకు వస్త్రంతోపాటు సుప్రభాతం, తోమాల, అర్చన తదితర సేవా టికెట్లను 30 ఏళ్ల వరకు మొత్తం విక్రయించారు. అప్పట్లో ఈ వ్యవహారం బయటకు రావడంతో 18 మందిపై కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు నిర్ధారించారు. దీంతో  ఆరుగురు ఉద్యోగులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు.

More Telugu News