Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్: డిస్కస్ త్రోలో కమల్ ప్రీత్ సంచలనం.. ఫైనల్‌కు అర్హత

  • మూడో ప్రయత్నంలో 64 మీటర్లు విసిరి ఫైనల్‌కు అర్హత
  • సీమా పూనియా అవుట్
  • దక్షిణాఫ్రికాతో పోరులో అదరగొడుతున్న టీమిండియా మహిళా హాకీ జట్టు
Kamalpreet Kaur reach finals in Discus Throw

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమయ్యేలా కనిపిస్తోంది. డిస్కస్ త్రోలో భారత సంచలనం కమల్‌ప్రీత్ కౌర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. డిస్కస్ త్రోలో 64 మీటర్ల దూరం విసిరితే ఫైనల్‌కు అర్హత సాధించినట్టే. కమల్‌ప్రీత్ మూడో ప్రయత్నంలో సరిగ్గా అంతేదూరం విసిరి ఫైనల్‌కు చేరింది.

మొత్తం మూడు రౌండ్ల పాటు జరిగిన డిస్కస్ త్రోలో తొలి రౌండ్‌లో 60.29, రెండో రౌండ్‌లో 63.97, మూడో రౌండ్‌లో 64 మీటర్లు విసిరింది. కాగా, అమెరికా క్రీడాకారిణి అమ్న్ వలరీ తొలి స్థానంలో నిలవగా, భారత్‌కే చెందిన మరో క్రీడాకారిణి సీమా పూనియా 16వ స్థానంతో సరిపెట్టుకుంది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో తొలి 12 స్థానాల్లో నిలిచిన వారు ఫైనల్‌కు ఎంపిక అవుతారు.

కాగా, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు అదరగొడుతోంది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో రెండు క్వార్టర్లు ముగిసే సరికి 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ పోరులో గెలిస్తే భారత జట్టు గెలవడంతోపాటు, బ్రిటన్-ఐర్లాండ్ మధ్య జరిగే పోరులో ఐర్లండ్ ఓటమి పాలైతే భారత జట్టు క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తుంది.

More Telugu News