ఐవోబీ నుంచి రుణం తీసుకునేందుకు ఏపీ పవర్ ఫైనాన్స్ కు ప్రభుత్వం హామీ!

30-07-2021 Fri 21:56
  • భారీ రుణ స్వీకరణకు సిద్ధమైన సర్కారు
  • ఐవోబీ నుంచి ఏపీ పవర్ ఫైనాన్స్ కు రూ.500 కోట్లు
  • ఇప్పటికే పలు బ్యాంకుల నుంచి రూ.6 వేల కోట్ల రుణం
  • హామీదారుగా నిలిచిన ప్రభుత్వం
AP Govt set to give assurance on huge loan

ఏపీ సర్కారు భారీ రుణం స్వీకరించేందుకు సిద్ధమైంది. ఐవోబీ నుంచి రూ.500 కోట్ల రుణం తీసుకునేందుకు ఏపీ పవర్ ఫైనాన్స్ కు ప్రభుత్వం హామీదారుగా నిలవనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వివిధ బ్యాంకుల ద్వారా రూ.6 వేల కోట్ల రుణాలకు హామీ ఇచ్చింది. కాగా, తాజాగా ఐవోబీ నుంచి స్వీకరించే మొత్తాన్ని ఏపీ పవర్ ఫైనాన్స్ డిస్కంలకు రుణంగా ఇవ్వనుంది.

ఇటీవల కాలంలో, ఏపీ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిందని విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. జీవీఎల్ వంటి నేతలు ఏకంగా దీనిపై కేంద్రానికి నివేదించారు. రుణ పరిమితిని దాటి మరీ అప్పులు చేస్తోందని ఆరోపించారు.