టీమిండియాలో మరో ఇద్దరు ఆటగాళ్లకు కరోనా

30-07-2021 Fri 20:13
  • లంక పర్యటన ముగించుకున్న భారత్
  • తాజాగా చాహల్, కృష్ణప్ప గౌతమ్ కు కరోనా
  • అంతకుముందే కృనాల్ పాండ్యకు పాజిటివ్
  • ముగ్గురూ లంకలోనే ఉంటారన్న అధికారులు
  • మిగిలిన ఆటగాళ్లు భారత్ రాక
Two more Indian cricketers tested corona positive in Sri Lanka

టీమిండియాలో కరోనా కలకలం కొనసాగుతోంది. శ్రీలంకలో పర్యటిస్తున్న భారత జట్టులో ఇటీవల కృనాల్ పాండ్య కరోనా బారినపడడం తెలిసిందే. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో మరో ఇద్దరు ఆటగాళ్లకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, కృష్ణప్ప గౌతమ్ కరోనా పాజిటివ్ గా తేలారు. నిన్న శ్రీలంక జట్టుతో టీ20 సిరీస్ ముగియడంతో టీమిండియా ఆటగాళ్లు భారత్ పయనమయ్యారు. అయితే కరోనా బారినపడిన కృనాల్ పాండ్య, చాహల్, కృష్ణప్ప గౌతమ్ లంకలోనే ఐసోలేషన్ పూర్తి చేసుకుని ఆలస్యంగా స్వదేశానికి వస్తారని అధికారులు తెలిపారు.

లంకతో వన్డే సిరీస్ ను 2-1తో నెగ్గిన భారత్... 1-2తో టీ20 సిరీస్ ను చేజార్చుకుంది. శిఖర్ ధావన్ నేతృత్వంలో లంక పర్యటనకు వెళ్లిన భారత జట్టులో ప్రతిభావంతులైన యువకులు ఉన్నా, కరోనా వ్యాప్తి రేపిన అలజడితో ఉత్సాహం లేనట్టుగా ఆడారు. టీ20 సిరీస్ ను అత్యంత పేలవమైన రీతిలో ఆడి లంకకు వరుసగా రెండు విజయాలు అప్పగించారు.