సాంకేతిక కారణాలతో 5 గంటలు నిలిచిపోనున్న 108 కాల్ సెంటర్ సేవలు

30-07-2021 Fri 20:01
  • 108 కాల్ సెంటర్ సేవలకు అంతరాయం
  • రాత్రి 1 గంట నుంచి నిలిచిపోనున్న సేవలు
  • ప్రత్యామ్నాయాలు సూచించిన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో
  • రెండు ఫోన్ నెంబర్లు వెల్లడి
Emergency call center services will be halt due to technical reasons

రాష్ట్రంలో 108 సేవలకు కొన్ని గంటల పాటు అంతరాయం ఏర్పడనుంది. ఏపీలో సాంకేతిక కారణాలతో 108 కాల్ సెంటర్ సేవలు 5 గంటల పాటు నిలిచిపోనున్నాయి. ఈ రాత్రి ఒంటిగంట నుంచి 108 సేవలు నిలిచిపోనున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో 08645660208, 8331033405కి కాల్ చేయాలని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో వెల్లడించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.