'పుష్ప'లో విలన్ గా సోను సూద్?

30-07-2021 Fri 18:15
  • షూటింగు దశలో 'పుష్ప'
  • విలన్ పాత్రలో ఫాహద్ ఫాజిల్
  • తెరపైకి సోను సూద్ పేరు
  • రావలసి ఉన్న క్లారిటీ
Pushpa in Sonu Sood

సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే 80 శాతం వరకూ పూర్తయింది. మిగతా 20 శాతం షూటింగు పూర్తిచేయడం కోసం కొన్ని రోజుల క్రితం రంగంలోకి దిగారు. అయితే సుకుమార్ కి ఫీవర్ రావడం వలన మళ్లీ కొన్ని రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు.

ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడిగా మొదటి నుంచి కూడా ఫాహద్ ఫాజిల్ పేరు వినిపిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు తెరపైకి సోను సూద్ పేరు వచ్చింది. సోను సూద్ ను ప్రత్యేకించి మరో పాత్ర కోసం తీసుకున్నారా? లేదంటే ఫాహద్ ఫాజిల్ కి బదులుగా తీసుకున్నారా? అనే విషయంలో క్లారిటీ రావలసి ఉంది.

ఇంతవరకూ ఈ సినిమా షూటింగులో ఫాహద్ ఫాజిల్ పాల్గొనకపోవడం సందేహాలకు కారణమవుతోంది. ఇక సోను సూద్ టాక్ కూడా ఎంతవరకూ నిజమనేది తెలియాల్సి ఉంది. రీసెంట్ గా సోను సూద్ 'ఆచార్య' షూటింగులో పాల్గొన్నాడు. అంతేకాదు వరుస బాలీవుడ్ సినిమాలతో ఆయన బిజీగా ఉన్నాడు.