త్వరలో 10 కోట్ల రూపాయ‌ల‌తో భ‌వానీపురం స్టేడియం: మంత్రి వెల్లంపల్లి

30-07-2021 Fri 18:09
  • విజయవాడలో వెల్లంపల్లి పర్యటన
  • పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి
  • భవానీపురం స్టేడియం ప్రస్తావన
  • విజయవాడకు ఐకాన్ గా నిలుస్తుందని వెల్లడి
Vellampalli tells Bhavanipuram Stadium will be constructed with ten crores expenditure

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయవాడలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భవానీపురం స్టేడియం అంశాన్ని ప్రస్తావించారు. రూ.10 కోట్ల వ్యయంతో 10 ఎకరాల స్థలంలో భవానీపురం స్టేడియం నిర్మాణాన్ని పూర్తిచేస్తామని వెల్లడించారు.

సీఎం జగన్ హయాంలో విజయవాడకు ఐకాన్ గా ఈ స్టేడియం అన్ని హంగులతో రూపుదిద్దుకుంటుందని వెల్లంపల్లి తెలిపారు. కాగా, ఈ  క్రీడా సముదాయంలో ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం, టెన్నిస్ కోర్టు, వాలీబాల్, బాస్కెట్ బాల్ కోర్టులు, క్రికెట్ పిచ్, ఓపెన్ జిమ్, స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ రింక్, ఇతర క్రీడలకు అనువైన నిర్మాణాలు చేపట్టనున్నారు.