ఏపీలో కొత్తగా 2,068 కరోనా పాజిటివ్ కేసులు

30-07-2021 Fri 17:30
  • గత 24 గంటల్లో 80,641 కరోనా పరీక్షలు
  • తూర్పుగోదావరిలో 337 కేసులు
  • కర్నూలు జిల్లాలో 18 కేసులు
  • రాష్ట్రంలో 22 మంది మృతి
  • ఇంకా 21,198 మందికి చికిత్స
AP Covid cases and casualties information

ఏపీలో గడచిన 24 గంటల్లో 80,641 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,068 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 337 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 315, కృష్ణా జిల్లాలో 251, ప్రకాశం జిల్లాలో 207, నెల్లూరు జిల్లాలో 205 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 18 కేసులు గుర్తించారు. అదే పమయంలో 2,127 మంది కరోనా నుంచి కోలుకోగా, 22 మంది మరణించారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఆరుగురు మృత్యువాతపడ్డారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 19,64,117 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,29,565 మంది పూర్తి ఆరోగ్యం సంతరించుకున్నారు. ఇంకా 21,198 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 13,354కి పెరిగింది.