టోక్యో ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు జోరు... చివరి లీగ్ మ్యాచ్ లో జపాన్ పై గెలుపు

30-07-2021 Fri 17:03
  • జపాన్ పై 5-3తో ఘనవిజయం
  • గ్రూప్-ఏలో భారత్ కు రెండో స్థానం
  • టాప్ లో ఆస్ట్రేలియా
  • నాలుగు విజయాలు సాధించిన భారత్
India hockey team beat Japan in Tokyo Olympics

టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు జోరు కొనసాగుతోంది. ఇవాళ గ్రూప్ దశ చివరి లీగ్ మ్యాచ్ లో భారత హాకీ జట్టు అద్భుత విజయం సాధించింది. గోల్స్ వర్షం కురిసిన ఈ మ్యాచ్ లో భారత్ 5-3తో జపాన్ ను ఓడించింది. భారత్ గ్రూప్-ఏలో మొత్తం 4 విజయాలు సాధించింది. నిన్న అర్జెంటీనాపై 3-1తో నెగ్గిన భారత్, అదే ఊపును ఇవాళ జపాన్ పైనా ప్రదర్శించింది. కాగా, గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో నిలిచింది. గ్రూప్ దశలో భారత హాకీ జట్టు ఆసీస్ చేతిలో ఘోరపరాభవం చవిచూడడం తెలిసిందే.