చివర్లో అమ్మకాల ఒత్తిడి.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

30-07-2021 Fri 16:07
  • 66 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 15 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 10 పాయింట్లకు పైగా లాభపడిన సన్ ఫార్మా
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ముగించాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. అయితే చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 66 పాయింట్ల నష్టంతో 52,586కు పడిపోయింది. నిఫ్టీ 15 పాయింట్లు కోల్పోయి 15,763 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (10.06%), టెక్ మహీంద్రా (7.24%), బజాజ్ ఆటో (2.18%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.18%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.77%).

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-2.59%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.28%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.16%), టాటా స్టీల్ (-1.73%), ఏసియన్ పెయింట్స్ (-1.29%).