కొత్త హెయిర్ స్టయిల్లో కనిపిస్తున్న ధోనీ!

30-07-2021 Fri 15:25
  • కొత్త హెయిర్ స్టైల్ అదిరిందంటున్న అభిమానులు
  • సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
  • ఇప్పటికే పలు హెయిర్ స్టైల్స్ లో కనిపించిన ధోనీ
Dhoni in new hair style

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ జట్టు కెప్టెన్ ధోనీ సరికొత్త హెయిర్ స్టైల్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ కొత్త హెయిర్ స్టైల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హెయిర్ స్టైల్ అదిరిందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అంతర్జాతీయ టెస్ట్, వన్డేల నుంచి ధోనీ తప్పుకున్న సంగతి తెలిసిందే. టీ20లు మాత్రం ఆయన ఆడుతున్నాడు. మరోవైపు ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై జట్టుకు ధోనీ నాయకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ లో అత్యధిక సార్లు ఫైనల్స్ కు చేరిన జట్టుగా సీఎస్కే రికార్డు సృష్టించింది.
.