టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు
- బ్యాడ్మింటన్ లో కొనసాగుతున్న సింధు జోరు
- క్వార్టర్ ఫైనల్లో అద్భుత విజయం
- జపాన్ షట్లర్ యమగూచిపై వరుస గేముల్లో గెలుపు
- సెమీస్ లో గెలిస్తే పతకం ఖాయం
తొలిగేమ్ లో యమగూచిని బలమైన స్మాష్ లు, తెలివైన ప్లేసింగ్ లతో బెంబేలెత్తించిన సింధుకు రెండో గేమ్ లో కాస్తంత ప్రతిఘటన ఎదురైంది. అయితే, అద్భుత ఆటతీరుతో పుంజుకున్న సింధు తన ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా గేమ్ ను, తద్వారా మ్యాచ్ ను కైవసం చేసుకుంది. ఇక సెమీఫైనల్లో గెలిస్తే సింధుకు పతకం ఖాయం అవుతుంది.