YS Sharmila: మేఘ కంపెనీకి డబ్బులిస్తే కేసీఆర్ కు కమిషన్లు వస్తాయి: షర్మిల

If money will be given to Megha company KCR will get commission says Sharmila
  • పంట నష్టపరిహారం ఇస్తే కేసీఆర్ కు కమిషన్లు రావు
  • యువతకు కార్పొరేషన్ లోన్లు ఇస్తే కేసీఆర్ కు కమిషన్లు రావు
  • ఉద్యోగులకు బిల్లులు చెల్లిస్తే కేసీఆర్ కు కమిషన్లు రావు
ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి సెటైర్లు వేశారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ... రైతులకు పంట నష్టపరిహారం ఇస్తే కేసీఆర్ కు కమిషన్లు రావని, యువతకు కార్పొరేషన్ లోన్లు ఇస్తే కేసీఆర్ కు కమిషన్లు రావని, డిస్కంలకు డబ్బులు చెల్లిస్తే కేసీఆర్ కు కమిషన్లు రావని, ఉద్యోగులకు బిల్లులు చెల్లిస్తే కేసీఆర్ కు కమిషన్లు రావని అన్నారు.

కానీ, ప్రాజెక్టులను రీడిజైన్ చేసి కాంట్రాక్టర్లకు కట్టబెడితే కేసీఆర్ కు కమిషన్లు వస్తాయని చెప్పారు. మేఘ కంపెనీ కట్టే ప్రాజెక్టులకు డబ్బులు ఇస్తే కేసీఆర్ కు కమిషన్లు వస్తాయని అన్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి అక్కరకు రాని పనులు చేస్తే గిట్లనే ఉంటది కేసీఆర్ దొర అని విమర్శించారు.

మరోవైపు ప్రతి మంగళవారం షర్మిల నిరుద్యోగ దీక్షలను చేపడుతున్న సంగతి తెలిసిందే. నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆమె మండిపడుతున్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
YS Sharmila
YSRTP
KCR
TRS
Megha

More Telugu News