V.V Lakshminarayana: కౌలుకు తీసుకున్న పొలంలో వరినాట్లు వేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ... ఫొటోలు ఇవిగో!

CBI Former JD Lakshminarayana joins paddy plantation in his leased
  • సీబీఐ మాజీ జేడీ రైతు అవతారం
  • రాజమండ్రి సమీపంలో పొలం లీజుకు తీసుకున్న వైనం
  • ఉత్సాహంగా పొలం పనుల్లో పాల్గొన్న లక్ష్మీనారాయణ
  • మిత్రులకు కృతజ్ఞతలు
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో 12 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. ధర్మవరం గ్రామానికి దగ్గర్లోని ఈ వరిపొలంలో ఆయన స్వయంగా నాట్లు వేయడం విశేషం. నారు పీకడం నుంచి నాట్లు వేయడం వరకు అన్నింటా ఉత్సాహంగా పనిచేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. వరినాట్లు వేసే కార్యక్రమం దిగ్విజయంగా ప్రారంభమైందని, రైతుల నుంచి వ్యవసాయంలో సూచనలు అందుకోవడం మంచి అనుభవం అని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తన సన్నిహితులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
V.V Lakshminarayana
Paddy Plantation
Lease
East Godavari District
CBI
Andhra Pradesh

More Telugu News