Bharathi Arira: శ్రీకృష్ణుడి సేవ కోసం ఉద్యోగాన్ని వదులుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారిణి

  • స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన భారతి అరోరా
  • 23 ఏళ్ల పాటు ఐపీఎస్ అధికారిణిగా కొనసాగిన భారతి
  • గురునానక్, తులసీదాస్ తదితరులు చూపిన మార్గంలో పయనిస్తానని వ్యాఖ్య
Senior IPS Bharathi Arora takes VRS to spend her rest life in service of Lord Krishna

హర్యానా రాష్ట్ర సీనియర్ ఐపీఎస్ అధికారిణి భారతి అరోరా అందరికీ షాకిచ్చారు. ఇంతకాలం ప్రజా సేవ చేసిన తాను... ఇకపై దైవ సేవ చేసుకుంటానని చెపుతూ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తన వీఆర్ఎస్ కు అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. ఇకపై తాను అసలైన జీవిత లక్ష్యం దిశగా అడుగులు వేస్తానని చెప్పారు. గురునానక్, తులసీదాస్, కబీర్ దాస్, చైతన్య మహాప్రభు తదితరులు చూపించిన మార్గంలో పయనిస్తానని తెలిపారు. తన శేష జీవితాన్ని కృష్ణ పరమాత్ముడి సేవకు అంకితం చేస్తానని చెప్పారు.

భారతీ అరోరా 23 ఏళ్ల పాటు ఐపీఎస్ అధికారిగా సేవలందించారు. ప్రస్తుతం ఆమె ఐజీ స్థాయిలో ఉన్నారు. తన కెరీర్ లో ఆమె ఎన్నో బాధ్యతలను నిర్వహించారు. సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలు పేలుడు కేసు దర్యాప్తులో కూడా ఆమె పాలుపంచుకున్నారు. ఇన్నేళ్ల పాటు ఐసీఎస్ అధికారిగా సేవలందించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. స్వచ్ఛంద విరమణకు గల కారణాలను తన రాజీనామా లేఖలో స్పష్టంగా పేర్కొన్నానని తెలిపారు. 

More Telugu News