రూ. 4 లక్షల కోట్ల ఆస్తిని మహిళలకు జగన్ అందించారు: రోజా

30-07-2021 Fri 12:10
  • 28 లక్షల ఇళ్లను మహిళలకు అందించారు
  • దేశంలో నాలుగు ఇళ్లను నిర్మిస్తే అందులో ఒకటి ఏపీలోదే
  • 50 శాతానికి పైగా నామినేటెడ్ పదవులను మహిళలకు కేటాయించారు
Jagan given Rs 4 lakh cr assets to women says Roja

రాష్ట్ర వ్యాప్తంగా 28 లక్షల ఇళ్లను మహిళలకు ముఖ్యమంత్రి జగన్ అందించారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. పేద మహిళలకు జగన్ అన్నగా మారారని చెప్పారు. దేశంలో నాలుగు ఇళ్లను నిర్మిస్తే అందులో ఒకటి ఏపీలోదని అన్నారు. 50 శాతానికి పైగా నామినేటెడ్ పదవులను మహిళలకు కేటాయించిన ఘనత జగన్ దని చెప్పారు. దిశ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చి మహిళలకు అండగా నిలిచారని కొనియాడారు. ఈరోజు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో రోజా, భూమన కరుణాకర్ రెడ్డిలు వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రోజా పైవ్యాఖ్యలు చేశారు.