'శ్రీదేవి సోడా సెంటర్' నుంచి ఆనంది ఫస్టులుక్!

30-07-2021 Fri 11:56
  • సుధీర్ బాబు నుంచి మరో చిత్రం
  • విలేజ్ నేపథ్యంలో సాగే కథ  
  • కథానాయికగా ఆనంది
  • త్వరలోనే విడుదల
Anandi first look from Sridevi Soda Center movie

సుధీర్ బాబు కథానాయకుడిగా 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా రూపొందుతోంది. విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి, కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో, కథానాయికగా 'ఆనంది' నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి 'ఆనంది' ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.

ఇది గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ. అందువలన పల్లెటూరి అమ్మాయిగానే ఈ సినిమాలో ఆనంది కనిపించనుంది. టైటిల్ కి తగినట్టుగానే ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఆనంది లుక్ వదిలారు. ఈ ఫస్టులుక్ లో ఆమె చాలా అందంగా కనిపిస్తూ అలరిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నరేశ్ .. అజయ్ .. రఘుబాబు కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.

'ఈ రోజుల్లో'.. 'బస్టాప్' వంటి సినిమాలతో తెలుగు తెరపై సందడి చేసిన ఆనంది, ఆ తరువాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ బిజీ అయింది. జీవీ ప్రకాశ్ కుమార్ తో అక్కడ ఎక్కువ సినిమాలు చేసింది. 'జాంబి రెడ్డి' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆనంది, ఈ సినిమాతో మరో హిట్ ను అందుకుంటుందేమో చూడాలి.