'రాధే శ్యామ్' రిలీజ్ డేట్ ఖరారు!

30-07-2021 Fri 11:11
  • పునర్జన్మల నేపథ్యంలో సాగే కథ 
  • విదేశాల్లో జరిగిన షూటింగ్ 
  • జనవరి 14న విడుదల 
  • సంక్రాంతికి గట్టి పోటీ    
Radhe Shyam movie update

ప్రభాస్ తాజా చిత్రంగా 'రాధేశ్యామ్' రూపొందింది. రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు. యూవీ క్రియేషన్స్ వారితో కలిసి కృష్ణంరాజు ఈ సినిమాను నిర్మించారు. ముగ్గురు సంగీత దర్శకులు ఈ సినిమా కోసం పనిచేశారు. ప్రభాస్ సరసన నాయికగా పూజ హెగ్డే నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ ప్రాజెక్టు పట్టాలెక్కి చాలాకాలమే అయింది. అనేక కారణాల వలన షూటింగు ఆలస్యమవుతూ వచ్చింది. ఇటీవలే షూటింగు పార్టును పూర్తిచేసుకున్న ఈ సినిమాను, 'సంక్రాంతి' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 14వ తేదీన విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను వదిలారు.

ఈ పోస్టర్ లో ప్రభాస్ చాలా స్టైలీష్ గా .. డీసెంట్ గా ఉన్నాడు. విదేశీ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. పునర్జన్మలతో కూడిన ప్రేమ చుట్టూ తిరుగుతుంది. సంక్రాంతికి పవన్ .. మహేశ్ బాబు .. వెంకటేశ్ సినిమాలు బరిలో ఉన్నాయి. ఇప్పుడు ప్రభాస్ సినిమా కూడా బరిలోకి దిగుతుండటం ఆసక్తిని రేకెత్తించే విషయం.