Diabetes: మధుమేహ రోగులకు గుడ్ న్యూస్.. తృణధాన్యాలతో టైప్-2 డయాబెటిస్ మాయం!

  • తృణధాన్యాలను ఆహారంలో చేర్చడం వల్ల చక్కని ఫలితం
  • 12-15 శాతం వరకు తగ్గనున్న రక్తంలో గ్లూకోజ్ స్థాయి
  • 11 దేశాలకు చెందిన 65 పరిశోధనా పత్రాల విశ్లేషణ
millets can check type 2 diabetes

తృణధాన్యాల (మిల్లెట్స్)తో మధుమేహం మాయమవుతుందని తాజా అధ్యయనంలో తేలింది. టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారు తమ ఆహారంలో క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల మధుమేహాన్ని నివారించవచ్చని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఆహారంలో తృణధాన్యాలను చేర్చడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగకుండా చూసుకోవచ్చని అధ్యయనకారులు తెలిపారు.

 ఇక్రిశాట్, జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్)తోపాటు మరో ఐదు సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు 11 దేశాలకు చెందిన 65 పరిశోధనా పత్రాలను విశ్లేషించిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. చిరుధాన్యాల ఆహారంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయి 12-15 శాతం వరకు తగ్గినట్టు గుర్తించారు.

హెచ్‌బీఏ1సీ స్థాయి కూడా క్రమంగా తగ్గి ప్రీ డయాబెటిక్ నుంచి సాధారణ స్థాయికి చేరుకుంటారని అధ్యయనానికి నేతృత్వం వహించిన సీనియర్ పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ అనిత తెలిపారు. ఈ అధ్యయన ఫలితాలు ‘ఫ్రంటైర్స్ ఇన్ న్యూట్రిషన్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

More Telugu News