సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

30-07-2021 Fri 07:37
  • 'ప్రాజక్ట్ కె'కి బల్క్ డేట్స్ ఇచ్చిన ప్రభాస్ 
  • పవన్ సినిమాకి వెటరన్ సినిమాటోగ్రాఫర్ 
  • బాల్యంలోకి వెళ్లే కథతో శర్వానంద్ సినిమా  
Prabhas allots bulk dates to Project K

*  'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం షూటింగ్ ఇటీవలే హైదరాబాదులో మొదలైంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ 200 రోజులు కేటాయించినట్టు చెబుతున్నారు. త్వరలోనే ఆయన ఈ చిత్రం షూటింగులో పాల్గొంటాడు. దీపిక పదుకొణే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనికి 'ప్రాజక్ట్ కె' అనే వర్కింగ్ టైటిల్ నిర్ణయించారు.
*  మలయాళంలో వచ్చిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాన్ని పవన్ కల్యాణ్, రానా హీరోలుగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తాజాగా ప్రముఖ ఛాయాగ్రాహకుడు రవి కె చంద్రన్ కెమేరా మేన్ గా జాయిన్ అయ్యారు.        
*  ప్రస్తుతం 'మహా సముద్రం', 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలలో నటిస్తున్న హీరో శర్వానంద్ తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పాడు. విశేషం ఏమిటంటే, ఈ చిత్రం టైమ్ ట్రావెల్ కథాంశంతో రూపొందుతుందట. ఇందులో హీరో టైమ్ మెషీన్ ద్వారా తన బాల్యంలోకి వెళ్లి .. అప్పటి అనుభూతులను, అనుభవాలను, చిలిపి పనులను గమనిస్తాడట. దీనికి ఓ నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది.