Sivanya: తమిళనాడులో ఎస్సై ఉద్యోగం సాధించిన ట్రాన్స్ జెండర్!

Transgender Sivanya gets sub inspector of police job in Tamilnadu
  • లింగ మార్పిడి చేయించుకున్న శివన్య
  • పోలీస్ రిక్రూట్ మెంట్ కు దరఖాస్తు
  • ఈవెంట్లు, పరీక్షల్లో సత్తా చాటిన వైనం
  • ఇటీవల నియామక పత్రం అందించిన సీఎం స్టాలిన్
గతంతో పోల్చితే దేశంలో ట్రాన్స్ జెండర్లలో చైతన్యం వస్తోంది. విద్య, ఉద్యోగాలు, ఇతర రంగాల్లో తాము ఎవరికీ తీసిపోమని ట్రాన్స్ జెండర్లు చాటుతున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన శివన్య పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ గా ఎంపికవడం ఈ కోవలోకే వస్తుంది. గతంలో ప్రీతిక యాసిని అనే ట్రాన్స్ జెండర్ తమిళనాడు పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం సాధించగా, శివన్య ఆమెను ఆదర్శంగా తీసుకుంది.

తిరువణ్ణామలైకి చెందిన శివన్య కామర్స్ లో డిగ్రీ పట్టా అందుకుంది. కొన్నాళ్ల కిందట లింగ మార్పిడి చేయించుకున్న శివన్యకు పోలీసు ఉన్నతాధికారి అవ్వాలనేది ఓ కల. అందుకే తమిళనాడు ప్రభుత్వ పోలీసు నియామక పరీక్షలకు హాజరైంది. ఫిజికల్ ఈవెంట్లలోనూ సత్తా చాటింది. ఆపై రాత పరీక్షలు, ఇంటర్వ్యూలోనూ శివన్య ప్రతిభ చాటింది.

ఈ క్రమంలో ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. నీకు పోలీస్ ఉద్యోగం కావాలా? అంటూ వెక్కిరింపులు ఎదురయ్యాయి. అవేవీ శివన్య స్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయాయి. అన్నింటా సత్తా నిరూపించుకున్న ఈ ట్రాన్స్ జెండర్ ఎస్ఐగా ఎంపికై, ఇటీవలే సీఎం స్టాలిన్ చేతుల మీదుగా నియామకపత్రం అందుకుంది.

కాగా, తన లక్ష్యం డీఎస్పీ అని, ఎప్పటికైనా ఆ ఉద్యోగాన్ని సాధిస్తానని శివన్య ధీమాగా చెబుతోంది. తన ప్రస్థానంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉందని వివరించింది. కాగా, శివన్య సోదరుడు తమిళనిధి పోలీసు డిపార్ట్ మెంట్ లోనే పనిచేస్తున్నాడు. ఏదేమైనా శారీరక అవరోధాలను అధిగమించి ఓ ట్రాన్స్ జెండర్ పోలీసు అధికారిణిగా ఎంపిక కావడం స్ఫూర్తిదాయకం.
Sivanya
Transgender
Sub Inspector
Job
Police
CM Stalin
Tamilnadu

More Telugu News