13 ఓవర్లలో టీమిండియా స్కోరు 48/5

29-07-2021 Thu 20:58
  • కొలంబోలో భారత్, శ్రీలంక మూడో టీ20
  • టాస్ గెలిచిన భారత్
  • టీమిండియా టాపార్డర్ కుదేలు
  • రాణించిన లంక బౌలర్లు
Team India in troubles

శ్రీలంకతో మూడో టీ20లో టీమిండియా కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాను లంక బౌలర్లు హడలెత్తించారు. దాంతో 13 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 5 వికెట్లు చేజార్చుకుని కేవలం 48 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ శిఖర్ ధావన్ డకౌట్ కాగా, మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 14 పరుగులు చేశాడు. దేవదత్ పడిక్కల్ 9, సంజు శాంసన్ సున్నా పరుగులు చేశారు. నితీశ్ రానా (6) సైతం నిరాశపర్చాడు. ప్రస్తుతం క్రీజులో భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. లంక బౌలర్లలో హసరంగ 2, మెండిస్ 1, షనక 1, చమీర ఒక వికెట్ తీశారు.