తెలంగాణలో కొత్తగా 623 కరోనా కేసులు

29-07-2021 Thu 20:47
  • గత 24 గంటల్లో 1,11,947 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 70 కేసులు
  • రాష్ట్రంలో ముగ్గురి మృతి
  • ఇంకా 9,188 మందికి చికిత్స
Telangana daily corona update

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,11,947 కరోనా పరీక్షలు నిర్వహించగా, 623 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 70, కరీంనగర్ జిల్లాలో 68, వరంగల్ అర్బన్ జిల్లాలో 67 కొత్త కేసులు వెలుగు చూశాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 746 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,43,716 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,30,732 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,188 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,796కి పెరిగింది.